News December 29, 2025
RSS అల్‌ఖైదా లాంటిది: మాణికం ఠాగూర్

RSSను ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో పోలుస్తూ కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘RSS విద్వేషాన్ని వ్యాప్తి చేసే సంస్థ. అల్‌ఖైదా లాంటిది. దాని నుంచి <<18686086>>నేర్చుకోవడానికి<<>> ఏమీ లేదు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది. ప్రజా ఉద్యమంగా పార్టీని గాంధీ మార్చారు. అలాంటి పార్టీ ఈ సంస్థ నుంచి నేర్చుకోవాలా?’ అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ హద్దు దాటుతోందని BJP మండిపడింది.
Similar News
News December 30, 2025
92 అంగన్‌వాడీ పోస్టులు.. అప్లై చేశారా?

AP: అనంతపురం జిల్లా <
News December 30, 2025
అంటే.. ఏంటి?: Pseudonym

కొందరు రచయితలు తమ సొంత పేరుకు బదులు పెన్ నేమ్ (కలం పేరు)తో రచనలు చేస్తారు. అలాంటి పేర్లను రచయితల pseudonym (స్యూడనమ్) అంటారు. ఇది గ్రీకు పదాల (pseudes – అబద్ధం, onuma: పేరు) నుంచి పుట్టింది. గ్రీకులో pseudonymos ఫ్రెంచ్‌లోకి pseudonymeగా మారి ఇంగ్లిష్‌లో Pseudonymగా స్థిరపడింది.
ex: I wrote under the pseudonym of Evelyn Hervey
డైలీ 12pmకు అంటే.. ఏంటి?లో ఓ కొత్త పదం గురించి తెలుసుకుందాం. <<-se>>#AnteEnti<<>>
News December 30, 2025
కవలలకు జన్మనిస్తే తల్లికి గుండె జబ్బుల ముప్పు

కవలలకు జన్మనిచ్చే స్త్రీలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. ప్రెగ్నెన్సీలో బీపీ సమస్యలు ఉంటే కవలలు పుట్టిన తర్వాత గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుందని అధ్యయనం వెల్లడించింది. ఒక సంవత్సరం లోపు గుండె జబ్బుల కారణంగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి మహిళలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.


