News December 29, 2025
పాలమూరు: భవనం పైనుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని భావన(17).. రెండో అంతస్తు నుంచి కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతికి కంటి చూపు సమస్య ఉందని స్థానికులు తెలిపారు. ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై సద్దాం పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
HNK:అవమానం భరించలేక యువకుడి సూసైడ్

అవమానం భరించలేని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పరమేశ్వర్ కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన మేకల బన్నీ(19) తన అక్క భర్త గణేష్, మామ, వారి బంధువు భాస్కర్ దుర్భాషలాడి దాడి చేయడంతో అవమానం భరించలేకపోయాడు. ఈ క్రమంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు అయింది.
News January 3, 2026
గ్రూపులు బువ్వ పెట్టవు.. కొత్త నేతలను గద్దల్లా పొడవొద్దు: ఈటల

TG: పార్టీలో చేరిన నేతలను గౌరవించి అక్కున చేర్చుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అంతేతప్ప కాకులు, గద్దల్లా పొడవొద్దని అన్నారు. ‘గ్రూపులు మంచివి కావు. అవి బువ్వ పెట్టవు. మనకు ఉన్న శక్తే తక్కువ. మళ్లీ ఇందులో గ్రూపులు అవసరమా? రాజకీయాల్లో విశాల హృదయంతో ఆలోచించాలి. శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు’ అని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
News January 3, 2026
జనవరి 3: చరిత్రలో ఈరోజు

1831: సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జననం
1925: నటుడు రాజనాల కాళేశ్వరరావు జననం
1934: రచయిత వీటూరి సత్య సూర్యనారాయణ మూర్తి జననం
1940: తెలుగు సినీ దర్శకుడు కట్టా సుబ్బారావు జననం
2002: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ మరణం
*జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం


