News December 29, 2025

నేటి నుంచి అసెంబ్లీ.. భద్రాచలం MLA ఎటువైపు..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన 10మంది ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది కాంగ్రెస్‌ నుంచే ఉండగా.. జిల్లా సమస్యలపై సభలో చర్చ జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. అటు భద్రాచలం MLA తెల్లం వెంకటరావు పార్టీ ఫిరాయింపుపై కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఏ పక్షాన కూర్చుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి సమావేశాల్లో కొన్ని సమస్యల పరిష్కారం ఉంటుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Similar News

News January 2, 2026

వరంగల్ పోలీసులపై డీజీపీకి MLC ఫిర్యాదు

image

వరంగల్ నగర పోలీసులపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. WGL తూర్పు నియోజకవర్గంలో రెండేళ్లుగా నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఉన్నతాధికారులతో విచారణ జరిపి దుర్వినియోగం పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సారయ్య డీజీపీని కోరారు. ఇప్పటికే WGL CPకి సైతం ఫిర్యాదు చేశారు. WGL తూర్పులో పోలీసులను అడ్డుపెట్టుకొని రౌడీయిజం చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

News January 2, 2026

పల్నాడు: టిప్పర్ ఢీకొని మహిళ మృతి

image

క్రోసూరు మండలం అందుకూరు వెళ్లే రోడ్డు మూల వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట కుమారిని లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. క్రోసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

MDK: మద్యం అమ్మకాలు నిషేధిస్తూ తీర్మానం

image

రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో మద్యం అమ్మకాలు నిషేధిస్తూ గ్రామసభ తీర్మానం చేశారు. సర్పంచ్ గట్టు సుశీల అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు పెరిగిపోవడంతో యువత పెడదారిన పడుతుందని, దీంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించారు. కిరాణా షాపుల్లో 18 సంవత్సరాల లోపు పిల్లలకు సిగరెట్లు విక్రయించవద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా విధిస్తామన్నారు.