News December 29, 2025
అసెంబ్లీలో ‘వరంగల్’ గళం వినిపించేనా?

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది అధికార పక్షంలోనే ఉన్నప్పటికీ, నియోజకవర్గ సమస్యలపై వారు ‘అధ్యక్షా’ అంటూ నోరు విప్పుతారా? అని ప్రజానీకం ఎదురుచూస్తోంది. గ్రేటర్ వరంగల్ డివిజన్ల పెంపు, కాజీపేట బ్రిడ్జి, ఎయిర్ పోర్ట్, 24 అంతస్తుల ఆసుపత్రి నిధులపై ప్రజాప్రతినిధులు గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News February 15, 2026
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News February 15, 2026
శివుడికి నేడు ఈ ఒక్క పువ్వు సమర్పిస్తే..

మహాశివరాత్రి నాడు శివలింగానికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే అనంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. 11 పూలతో ఆయనను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని అంటున్నారు. ‘పంచాక్షరి మంత్రం జపిస్తూ పూలు సమర్పించాలి. ఇలా చేస్తే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అపరాజిత జలాభిషేకంతో శివానుగ్రహం లభించి సకల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు’ అని సూచిస్తున్నారు.
News February 15, 2026
WGL: కార్యకర్తలు ఎవరు? కట్టప్పలు ఎవరు?

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార-ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. కొన్ని వార్డుల్లో అనూహ్య ఫలితాలు రావడంతో అంతర్గత విభేదాలు, అసంతృప్తి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పని చేయాల్సిన వారే ప్రత్యర్థులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమికి బాధ్యులెవరు అన్న దానిపై నేతలు సమీక్షలు చేపడుతున్నారు.


