News December 29, 2025

ప్రపంచంలో షార్టెస్ట్ ఫ్లైట్ రూట్.. 90 సెకన్లలో..

image

స్కాట్లాండ్‌లోని వెస్ట్రే-పాపా వెస్ట్రే దీవుల మధ్య ఓ చిన్న విమానం 2.7KM దూరాన్ని కేవలం 90 సెకన్ల నుంచి 2 ని.ల్లో చేరుకుంటుంది. అంటే సీట్ బెల్ట్ పెట్టుకునే సమయం కంటే తక్కువ టైమ్‌లోనే ల్యాండ్ అవుతుందన్న మాట. రోజూ 8-10 మందితో రాకపోకలు సాగిస్తోంది. విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లు ఎక్కువగా వినియోగిస్తారు. బ్రిడ్జి కట్టేందుకు ఎక్కువ ఖర్చు, పడవల్లో ఎక్కువ సమయం వల్ల ఫ్లైట్ బెటర్ ఆప్షన్‌గా ఎంచుకున్నారు.

Similar News

News February 11, 2026

పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

image

ప్రస్తుతకాలంలో పిల్లలు, యుక్తవయస్సు వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో BP ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో BP ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి BP చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.

News February 11, 2026

పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

image

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.

News February 11, 2026

వందేమాతరం.. ఇకపై లేచి నిలబడాల్సిందే!

image

అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్‌ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్‌లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. సినిమాలు, డాక్యుమెంటరీ లేదా న్యూస్‌రీల్ మధ్యలో వందేమాతరం వస్తే మాత్రం థియేటర్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.