News December 29, 2025

మదనపల్లె జిల్లానే.. కానీ పేరు అన్నమయ్య!

image

మదనపల్లె జిల్లాలో కొత్త ట్విస్ట్ నెలకొన్నట్లు సమాచారం. రాజంపేటను కడపలో, రైల్వేకోడూరును తిరుపతిలో కలపడంతో అన్నమయ్య జిల్లా రద్దు అవుతుందని అందరూ భావించారు. రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లా(మందు అనుకున్న పేరు)లో కలుపుతారు. మదనపల్లె కేంద్రంగానే అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలని నిన్నటి సమావేశంలో సీఎంతో చర్చించినట్లు సమాచారం. నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత దీనిపై స్పష్టత రానుంది.

Similar News

News February 10, 2026

జైలుకి వెళ్లడానికైనా సిద్ధమే: అస్సాం సీఎం

image

హైదరాబాద్‌లో తనపై అసదుద్దీన్‌ ఒవైసీ ఫిర్యాదు చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. బంగ్లాదేశ్‌ చొరబాట్లపై తాను చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే’ అని పేర్కొన్నారు. కాగా మతపరంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ హిమంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

News February 10, 2026

ఢిల్లీ చేరిన సీఎం.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

image

AP: సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లిన ఆయనకు టీడీపీ ఎంపీలు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారితో కొద్దిసేపు సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం 1 జన్‌పథ్‌లోని తన నివాసానికి వెళ్లారు.

News February 10, 2026

KNR: పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే

image

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే కేంద్రాల్లో ఈనెల 10, 11 తేదీల్లో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న విద్యా సంస్థలు, కార్యాలయాలకు ఈ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున ఈనెల 11న సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.