News December 29, 2025
HYD: అందులో మన జిల్లానే టాప్

తెలంగాణలో HYDలో అత్యధికంగా 4.82 లక్షల MSME పరిశ్రమలు ఉన్నట్లు MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల సంఖ్యలో రంగారెడ్డి జిల్లా 2.84 లక్షలతో రెండో స్థానంలో నిలవగా మేడ్చల్ జిల్లా 2.24 లక్షలతో మూడో స్థానం సాధించింది. MSME రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారిందని అన్నారు. ఉపాధి కల్పనలోనూ, రాష్ట్ర జీడీపీలోనూ ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
మిచెల్ మరో సెంచరీ..

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ ప్లేయర్ <<18860730>>మిచెల్<<>> 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. వరుసగా ఇది రెండో శతకం కావడం గమనార్హం. అటు ఈ సిరీస్‌లో 300+ స్కోరుతో కొనసాగుతున్నారు. భారత్‌పై వన్డేల్లో 11 ఇన్నింగ్సుల్లో మిచెల్‌కు ఇది నాలుగో సెంచరీ. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 36 ఓవర్లలో 201/3గా ఉంది.
News January 18, 2026
ఎన్టీఆర్, YSR సెంటిమెంటుతో రేవంత్ వ్యూహం!

TG: ఖమ్మం పాలేరులో జరిగిన సభలో CM రేవంత్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. NTR స్ఫూర్తితో సన్నబియ్యం, YSR స్ఫూర్తితోనే ఉచిత కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ దివంగత నేతలకు ఖమ్మంలో ఫాలోయింగ్ ఎక్కువనే సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో BRSను ఓడించేందుకు CM వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
News January 18, 2026
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రమణ

జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆదివారం జగిత్యాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు లక్షల రూపాయల విలువ చేసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎల్ రమణ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


