News December 29, 2025
సిగాచి ప్రమాదం: ‘ఎట్టకేలకు 8మందికి డెత్ సర్టిఫికెట్లు’

సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ఆచూకీ లభ్యం కానీ ఎనిమిది మంది కార్మికుల డేత్ సర్టిఫికెట్లు ఎట్టకేలకు ఇవ్వనున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో సోమవారం ఉదయం 11 గంటలకు వీరి డెత్ సర్టిఫికెట్లను అందజేస్తామని మున్సిపల్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. డేత్ సర్టిఫికెట్ల కోసం పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గత సోమవారం కలెక్టర్‌ను కలిసిన విషయం తెలిసిందే.
Similar News
News January 1, 2026
మెదక్: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: కలెక్టర్

ప్రజలందరూ ఆనందంగా సుఖసంతోషాలతో పాడిపంటలతో ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని మెదక్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News January 1, 2026
మెదక్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: అదనపు కలెక్టర్

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మహాసభల కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. డిపో మేనేజర్ సురేఖ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
News January 1, 2026
VKB: రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న ‘రోడ్డు భద్రతా మాసోత్సవ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నెల పాటు ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.


