News December 29, 2025

కరీంనగర్: జిల్లాకు ఒకటి చొప్పున క్రిటికల్ కేర్ సెంటర్..!

image

ప్రైవేట్ దోపిడీ కట్టడి, కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో సర్కార్ దవాఖానాల్లో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. మెయిన్ ఆస్పత్రులకు సంబంధం లేకుండా స్వయంప్రతిపత్తితో ఇవి నడుస్తాయి. 50 పడకల ఆస్పత్రుల్లో 10 ICU, 6 హైడిపెండెన్స్ యూనిట్, 4 ఎమర్జెన్సీ బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే KNRలో ప్రారంభమై GDK, JGTLలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.SRCLలో పనులు సాగుతున్నాయి.

Similar News

News January 1, 2026

MBNR:News Year..స్టాల్స్ ఏర్పాటుకు ఆహ్వానం

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని స్థానిక మయూరి ఎకో పార్క్‌కు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున పార్క్ లో రుసుముతో కూడిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకున్న వారు స్థానిక పార్క్ లో సంప్రదించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 1, 2026

కర్నూలులో స్పెషల్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

image

కర్నూలు జిల్లాలో ఆరోగ్యం, విద్య, సంక్షేమ వసతి గృహాల ఫిర్యాదుల పరిష్కారం కోసం కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం నూతన కంట్రోల్ రూమ్‌ ప్రారంభించారు. టోల్‌ ఫ్రీ నంబర్ 1800 425 4299కు వచ్చిన 109 కాల్స్‌లో ఇప్పటికే 99 సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News January 1, 2026

NZB: న్యూ ఇయర్ కేక్ కోసిన సీపీ

image

నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నూతన సంవత్సర స్వాగత సంబరాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కేకు కోసి నగర పోలీస్ అధికారులకు తినిపించారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.