News April 24, 2024

తాడికొండ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు.. పలువురి పేర్లు ప్రకటన

image

ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించింది. తాడికొండ(ఎస్సీ) నియోజకవర్గానికి చిలకా విజయ్ కుమార్ స్థానంలో మణిచల సుశీల్ రాజా పేరును ఖరారు చేసింది. రేపల్లె- మోపిదేవి శ్రీనివాసరావు, తెనాలి – ఎస్కే బషీద్ , గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి డాక్టర్. రాచకొండ జాన్ బాబు పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.

Similar News

News March 14, 2026

గుంటూరులో బ్లింకిట్ పేరుతో సైబర్ మోసం

image

గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణనగర్ నాలుగో లైన్‌కు చెందిన పగడాల ప్రసాద్‌ను సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. బ్లింకిట్ యాప్ ఆర్డర్ రిటర్న్ పేరుతో గూగుల్‌లో కనిపించిన నంబర్‌కు కాల్ చేయగా యూపీఐకు డబ్బు పంపితే రిఫండ్ వస్తుందని చెప్పి రూ.84 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 14, 2026

మంగళగిరిలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష

image

కుంచనపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆహార భద్రత సూచీలో దేశంలో తొలి 10 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేయాలన్నారు. బాగా పనిచేసేవారిని ప్రోత్సహించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉంటాయన్నారు.

News March 14, 2026

గుంటూరు: రెవెన్యూ అధికారుల సస్పెండ్

image

భూమి మ్యుటేషన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన తాడికొండ MRO పి.మెహర్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎన్. హనుమంతరావు, VROలు టి.బ్రహ్మయ్య, జి.రాంబాబును కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో లోపాలు బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.