News December 29, 2025
WGL: ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందే!

ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సుమారు 30 మంది IAS, IPS, IFS అధికారులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 ఏడాదికి సంబంధించిన స్థిరాస్తి వివరాలను (IPR) జనవరి 31లోపు సమర్పించాలని పేర్కొంది. నిర్ణీత 33 రోజుల గడువులోగా వివరాలు ఇవ్వని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు తమ ఆస్తుల డేటాను గడువులోగా ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 11, 2026
ఉల్లి దిగుమతులు తగ్గించిన బంగ్లా.. వేరే దేశాల్లో భారీ డిమాండ్

IND నుంచి ఉల్లిపాయల దిగుమతిని బంగ్లాదేశ్ భారీగా తగ్గించింది. కొన్ని రోజులుగా కొత్త పర్మిట్లు ఇవ్వడంలేదు. 2023-24లో 8 లక్షల టన్నులను దిగుమతి చేసుకున్న బంగ్లా 2025 APR-SEP మధ్య కేవలం 12,900 టన్నులు మాత్రమే తీసుకుంది. తమ దేశ రైతులను ఆదుకునేందుకు దిగుమతులు తగ్గించినట్టు బంగ్లా చెబుతున్నా, రాజకీయ విభేదాలే కారణంగా తెలుస్తోంది. భారత ఎర్ర ఉల్లిపాయలకు మలేషియా, శ్రీలంక సహా పలు దేశాల్లో భారీ డిమాండ్ ఉంది.
News January 11, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 11, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.23 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.16 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 11, 2026
కల్తీ నెయ్యి కేసుపై సిట్ సమగ్ర చర్చ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ అధికారులు సుదీర్ఘ సమయం కేసుపై సమగ్ర చర్చ నిర్వహించారు. CBI జేడీ వీరేశ్ ప్రభు డీఐజీ మురళీ రాంబతో కలిసి కేసులో భాగమైన అధికారులతో న్యాయపరమైన అంశాలపై చర్చించారు. పలు పత్రాలను పరిశీలించారు. త్వరలో మూడో ఛార్జ్ షీట్, సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు నివేదిక అందించనున్నారు.


