News December 29, 2025
పర్యాటక రంగంలో దూసుకుపోతున్న పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లా పర్యాటక రంగంలో ఈ ఏడాది గణనీయమైన పురోగతి సాధించింది. ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్, అమరావతి దేవాలయం, ధ్యాన బుద్ధ, ఎత్తిపోతల జలపాతం, పులిచింతల, కొండవీడు, కోటప్పకొండ, గుత్తికొండ, దైద బిలం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధిలోకి రావడం విశేషం. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా బౌద్ధ సర్క్యూట్ ను ప్రోత్సహిస్తూ బుద్ధ వనం అభివృద్ధి చేయడంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది.
Similar News
News January 6, 2026
పాలమూరు: జూనియర్ డాక్టర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

మెడికో లావణ్య ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ విఫలమవడం వల్లే ఆమె <<18765417>>ఆత్మహత్య <<>>చేసుకున్నట్లు విచారణలో తేలింది. సిద్దిపేటలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రణయ్ తేజ్‌తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ప్రణయ్ పెళ్లికి నో చెప్పడంతో నిర్ణయం తీసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల(D) మానవపాడు మండలం జల్లాపురానికి చెందిన లావణ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
News January 6, 2026
అమలాపురం మున్సిపాలిటీకి ‘ప్రథమ’ శ్రేణి హోదా!

అమలాపురం పురపాలక సంఘం స్థాయి పెరిగింది. ఈ పురపాలక సంఘాన్ని ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం నుంచి దీనికి సంబంధించిన అధికారిక లేఖ అందినట్లు కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. పట్టణాన్ని ప్రథమ శ్రేణిగా తీర్చిదిద్దేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన కృషి ఫలితమేనని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 6, 2026
హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

HYDలోని ECIL 4 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech 60% మార్కులతో ఉత్తీర్ణులై, పనిఅనుభవం గలవారు జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, షార్ట్ లిస్టింగ్, DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.5వేలు పెంచుతారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in


