News December 29, 2025
బడ్జెట్ ఫోన్లను వెనక్కి నెట్టి.. iPhone 16 రికార్డ్ సేల్స్

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2025లో బడ్జెట్ ఫోన్లను వెనక్కి నెట్టి iPhone 16 అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. ఓ రిపోర్ట్ ప్రకారం.. తొలి 11 నెలల్లోనే 65 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. తక్కువ ధరకు లభించే వివో ఫోన్ల కంటే ఇది చాలా ఎక్కువ. వివిధ ఆఫర్ల వల్ల సామాన్యులు కూడా ఐఫోన్ల వైపు మొగ్గుతున్నారు. భారత్‌లో తయారీ, కొత్త స్టోర్లు యాపిల్‌కు కలిసొచ్చాయి.
Similar News
News February 16, 2026
ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

మారిన జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే BP బారిన పడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు రోజూ మాత్రలు వాడుతున్నారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఏటా 2 ఇంజెక్షన్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మేరకు USకు చెందిన రోచీ అండ్ అల్నిలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
News February 16, 2026
ఏటి ఈతకు లంక మేతకు సరి

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News February 16, 2026
విరమణ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి?

రోజంతా ఉపవాసం ఉన్నందున, విరమణ సమయంలో ఒకేసారి భారీ ఆహారం తీసుకోకూడదు. ముందుగా మంచినీరు, పండ్ల రసంతో కడుపుని తేలికపరచాలి. ఆ తర్వాత సాత్విక ఆహారమైన అన్నం, పప్పులు వంటి సులభంగా అరిగే పదార్థాలను తీసుకోవాలి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదని పండితుల సూచన.


