News April 24, 2024
కంటతడి పెట్టిన కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి, సోదరిని తలుచుకొని నివేదిత కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నివేదితను గెలిపించుకోవాలని మల్లారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
Similar News
News March 13, 2026
ఉస్మానియా తరలింపు వెనక అసలు ప్లాన్ ఇదే!

ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల్లో అత్యంత కీలకం కానుంది. అఫ్జల్‌గంజ్‌లోని 26 ఎకరాల భూమిని ‘హెల్త్ టూరిజం’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం లోలోపల కసరత్తు చేస్తోందని సమాచారం. పాత వారసత్వ భవనాన్ని కేవలం మ్యూజియంగా మార్చి, మిగిలిన ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించే ప్రతిపాదన బడ్జెట్ ప్రసంగంలో ‘పరోక్షంగా’ వెల్లడికానుంది.
News March 13, 2026
HMDA వర్సెస్ కార్పొరేషన్: ఫీజులన్నీ ఎవరికి?

10 అంతస్తులకు మించిన బిల్డింగ్ అనుమతులను HMDA తన గుప్పిట్లోకి తీసుకోవడంపై లోకల్ బాడీలు రగిలిపోతున్నాయి. గతంలో కార్పొరేషన్లకు అందే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు ఇప్పుడు HMDA ఖాతాలోకి వెళ్లడం వల్ల తమ అభివృద్ధి పనులకు నిధులు కరువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం ప్లానింగ్ కోసం చేసిన మార్పు కాదు, బడా ప్రాజెక్టుల ఆదాయాన్ని కేంద్రీకరించే వ్యూహం అని స్పష్టమవుతోంది.
News March 13, 2026
గ్యాస్ కొరత.. అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

ఇరాన్‑ యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరతపై సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈరోజు సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 86% డొమెస్టిక్, 14% కమర్షియల్ సప్లై ఉండగా, ప్రస్తుత నిల్వలు, సరఫరా ఇబ్బందులను పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.


