News December 29, 2025

అమెరికాలో యాక్సిడెంట్.. మహబూబాబాద్ యువతులు మృతి

image

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. గార్ల మీసేవ కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన కారులో యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నత చదువుల కోసం వెళ్లి విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వార్తతో విషాద ఛాయలు అలముకున్నాయి.

Similar News

News January 8, 2026

టెండర్లు లేకుండా ‘లులూ’కు భూములా?: జగన్

image

AP: 2019-24 మధ్య పారిశ్రామిక వృద్ధిలో రాష్ట్రం నంబర్-1గా ఉండేదని మాజీ సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు బెదిరింపులు తాళలేక, కప్పం కట్టలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని విమర్శించారు. అదే సమయంలో తనకు ఇష్టమైన కంపెనీలకు పప్పుబెల్లాల్లా భూములు పంచిపెడుతున్నారని మండిపడ్డారు. ‘లులూ కంపెనీ అహ్మదాబాద్‌లో భూములు కొనుక్కుంది. ఏపీలో మాత్రం టెండర్లు లేకుండానే భూములు ఇచ్చేశారు’ అని ఆరోపించారు.

News January 8, 2026

నాన్న ఛాతీనే ❤️ పట్టుపాన్పు

image

భక్తుల శరణుఘోషలు, విపరీతమైన చలి.. ఇవేమీ లెక్కచేయకుండా నాన్న ఛాతీపై హాయిగా నిద్రపోతున్న కన్నెస్వామి ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసి ఆ మణికంఠుడిని దర్శించుకుని ఈ చిన్నారి అలసిపోయింది. నాన్న గుండెచప్పుడే గుడి గంటలుగా, ఆయన ఒడే పట్టుపాన్పుగా, ప్రపంచంలోనే సురక్షిత ప్రదేశంగా భావించి నిద్రపోయింది. ఆ తండ్రి కూడా బిడ్డ నిద్రకు భంగం కలిగించకుండా కదలకుండా ఉండిపోయాడు. ఎంతైనా అమ్మాయికి తండ్రే కదా సూపర్ హీరో.

News January 8, 2026

HYDలో నేను ఎక్కడ నడవాలి? చెప్పండి ప్లీజ్!

image

‘నాకు కారులేదు. బండి లేదు. సైకిల్ కూడా లేదు. అందుకే నేను నడుచుకుంటూ వెళ్లాలి. మరి ఎలా వెళ్లాలి? మహానగరంలో ఎక్కడ చూసినా రోడ్లే. నేను నడవాలంటే రోడ్లపై నడవాల్సిందేనా? సిటీలో దాదాపు 10వేల KM రోడ్లు ఉంటే నడవడానికి 550 KM ఫుట్‌పాత్ ఉంది. ఇదేం పద్ధతి? ఎక్కడ చూసినా ఆక్రమణలే.. వ్యాపారులు, సామగ్రి, పాన్ డబ్బాలు ఆక్రమించాయి? నేను నడిచేందుకు దారి చూపించండి సార్.. అంటూ ఓ నగరవాసి చేసిన విన్నపం ఇది.