News December 29, 2025

ఈ మెడిసిన్ కొంటున్నారా?

image

అనారోగ్యానికి గురైన సమయంలో తీసుకునే కొన్ని ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్‌పై ఉండే ఎర్రటి గీతను ఎప్పుడైనా గమనించారా? రెడ్‌లైన్ ఉంటే వైద్యుడి సలహా లేకుండా వినియోగించకూడదని కేంద్రం చెబుతోంది. యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన తీసుకోవడం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌‌కు దారితీస్తుందని హెచ్చరించింది. ఇలాంటి విషయాల్లో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. మెడిసిన్ కొనే సమయంలో గడువు తేదీతో పాటు రెడ్ లైన్‌ను గమనించండి.

Similar News

News February 18, 2026

బ్యాటరీ రెంటల్ కార్లు.. ఏంటీ విధానం?

image

ఈ విధానంలో కస్టమర్ కేవలం కారే కొనుగోలు చేస్తాడు. బ్యాటరీ కాదు. బ్యాటరీని షోరూమ్ రెంట్‌కి ఇస్తుంది. నెలకు మినిమం అమౌంట్ డిపాజిట్ చేసుకుంటుంది. ఆపై ఎన్ని కి.మీ ఎక్కువ తిరిగితే దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తుంది. కారు కొనుగోలు సమయంలో కస్టమర్‌పై అధిక భారం పడొద్దనే కంపెనీలు బ్యాటరీ రెంటల్ విధానాన్ని తీసుకొచ్చాయి. మార్కెట్లో ఇప్పటికే MG విండ్సర్ ఇలాగే రన్ అవుతుండగా తాజాగా మారుతీ <<19171974>>ఈ-విటారా<<>> వచ్చింది.

News February 18, 2026

పూజ పూర్తయ్యాక ఈ తప్పులు చేస్తున్నారా?

image

దైవానుగ్రహం కలగాలంటే పూజ సమయంలోనే కాదు, పూజ తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. పూజ ముగిసిన వెంటనే కాళ్లు కడగకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. పూజ చేసిన రోజున మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. నైవేద్యాన్ని సమర్పించిన వెంటనే తీయకూడదు. కాసేపు అక్కడే ఉంచాలి. పూజలో, పూజానంతరం కోపతాపాలు మానాలి. ప్రశాంతంగా ఉంటే దైవశక్తి పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సానుకూలతను నింపుతాయి.

News February 18, 2026

BECILలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)లో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech,డిప్లొమా, ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జూనియర్ ఇంజినీర్‌కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా, సూపర్‌వైజర్, MTSపోస్టుకు 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com