News December 29, 2025

వచ్చారు.. వెళ్లారు

image

TG: ఇటీవల ప్రెస్‌మీట్ తర్వాత KCR అసెంబ్లీ సెషన్‌లో పాల్గొంటారని జోరుగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళ సభకు హాజరైన ఆయన కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నారు. జాతీయ గీతాలాపన తర్వాత సభను వీడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన JAN 2, 3న నదీ జలాలపై జరిగే చర్చలో పాల్గొంటారని గులాబీ కార్యకర్తలు అంటున్నారు.

Similar News

News January 12, 2026

కర్కాటకము వర్షిస్తే కాడిమోకు తడవదు

image

సాధారణంగా కర్కాటక కార్తెలో వర్షాలు చాలా వేగంగా, కుండపోతగా కాకుండా కేవలం తుంపర్లుగా లేదా చాలా తక్కువ సమయంలోనే కురిసి ఆగిపోతుంటాయి. ‘కాడి’ అంటే ఎడ్ల మెడపై వేసే చెక్క, ‘మోకు’ అంటే దానికి కట్టే బలమైన తాడు. కర్కాటక కార్తెలో వర్షం ఎంత తక్కువగా కురుస్తుందంటే, కనీసం పొలంలో పని చేసే ఎడ్ల కాడికి ఉన్న ఆ తాడు కూడా పూర్తిగా తడవనంత తక్కువగా ఉంటుందని దీని అర్థం. ఈ వర్షం వల్ల ప్రయోజనం ఉండదని భావం.

News January 12, 2026

ప్రీ అప్రూవ్డ్ లోన్‌ ఎవరికిస్తారో తెలుసా?

image

ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు ముందుగానే అర్హత నిర్ధారించి ఎంపిక చేసిన కస్టమర్లకు ఇస్తాయి. ఆదాయం, సిబిల్ స్కోర్, లావాదేవీల ఆధారంగా లోన్ మొత్తాన్ని ఫిక్స్ చేస్తాయి. సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి SMS లేదా ఈమెయిల్ పంపిస్తాయి. తక్కువ డాక్యుమెంట్స్‌తో లోన్ మంజూరు చేస్తాయి. అయితే అధిక వడ్డీ ఉండే అవకాశం ఉంది. దీంతో అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 12, 2026

చివరి 2 వన్డేలకు సుందర్ ఔట్?

image

టీమ్ ఇండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. కివీస్ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్ వేస్తున్న సమయంలో గాయపడటంతో వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చినా ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో చివరి 2 ODIలు ఆడకపోవచ్చని సమాచారం. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.