News December 29, 2025
రూ.600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్. డీల్ ఫిక్స్ అయితే భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికం కానుంది.
Similar News
News February 21, 2026
నేడు శ్రీవారి ఆలయాల్లో ‘కూటమి’ పూజలు, సంప్రోక్షణలు

AP: వైసీపీ సభ్యులు శ్రీవారి ఫొటోలను శాసనమండలికి తీసుకొచ్చి మహాపచారం చేశారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్‌లు నిర్వహించాలని, నేడు శ్రీవారి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు చేయాలని నిర్ణయించారు. వేంకటేశ్వర స్వామి చిత్రాలను అపవిత్రం చేసి జగన్, వైసీపీ సభ్యులు మహాపరాధానికి పాల్పడ్డారని, దీనిపై హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది.
News February 21, 2026
పిల్లలకు నెబులైజర్ వాడుతున్నారా?

వాతావరణం మారినపుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినపుడు పిల్లల ఊపిరితిత్తుల్లో తెమడ చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు మాత్రం నెబ్యులైజర్ వాడాలి. కానీ కొంతమంది ముక్కు దిబ్బడ, జలుబు వేగంగా తగ్గుతాయని సొంతంగానే నెబ్యులైజర్ వాడుతుంటారు. కానీ అది సరికాదు. డాక్టర్ సలహా మేరకే నెబ్యులైజర్‌ని ఉపయోగించాలి. ఒకవేళ పిల్లలకు అలర్జీ సమస్య ఉంటే అత్యవసర సమయంలో నెబ్యులైజర్ వాడచ్చు.
News February 21, 2026
నెటిజన్ దారుణ కామెంట్.. గట్టిగా బదులిచ్చిన చిన్మయి!

తనపై దారుణ కామెంట్ చేసిన నెటిజన్‌కు సింగర్ చిన్మయి గట్టిగా బదులిచ్చారు. దేశంలో చిన్నారులపై లైంగిక దాడులు చేసేవాళ్లు లక్షల్లో ఉన్నారని ఆమె ట్వీట్ చేయగా ‘నిన్ను మీ నాన్న రేప్ చేసుంటాడు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘నా తండ్రి నన్ను రేప్ చేయలేదు. కానీ కూతుళ్లను తండ్రులు రేప్ చేస్తారని మీరు ఊహించుకుంటారు. ఇలా మాట్లాడుతున్నారంటే మీరేంటో, మిమ్మల్ని ఎవరు పెంచారో అర్థమవుతోంది’ అని చిన్మయి కౌంటరిచ్చారు.


