News December 29, 2025
న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. వేడుకల నిర్వహణపై పలు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజేలు ఏర్పాటు చేయడం, ర్యాలీలు తీయడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. రహదారులపై కేక్ కటింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి పనులకు దూరంగా ఉండాలని సూచించారు.
Similar News
News January 13, 2026
రాష్ట్రంలో రూ.3,538 కోట్లతో సోలార్ కాంప్లెక్స్

AP: తిరుపతి జిల్లాలోని MP-SEZలో వెబ్‌సోల్ సంస్థ రూ.3,538 కోట్లతో 8GW ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇందులో 4GW సోలార్ సెల్స్, 4GW సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉంటాయి. 2 దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం 300 ఎకరాల్లో 100MW క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
News January 13, 2026
మేడారం: జంపన్నవాగు జంట బ్రిడ్జిల హిస్టరీ తెలుసా..?

మేడారం జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణం సాధారణంగా జరగలేదు. 2002లో అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించారు. వ్యతిరేకించిన నక్సలైట్లు పేల్చివేయాలని యత్నిస్తే మహిళలు రక్షక దళంగా ఏర్పడి అడ్డుకున్నారు. దీంతో అన్నలు వెనక్కి తగ్గగా కేవలం 37 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. 2018లో రెండో బ్రిడ్జిని నిర్మించారు. ఇది కూడా 38 రోజుల్లోనే పూర్తయ్యింది.
News January 13, 2026
తిరుపతి జిల్లాకు వాటితో ముప్పు..!

తిరుపతి జిల్లాలోని దామలచెరువు, ముంగిలిపుట్టు, బలిజపల్లి గ్రామాల్లో భూగర్భ జలాల్లో యురేనియం ఆనవాళ్లు ఉన్నట్లు CGWB నివేదిక పేర్కొంది. మరోవైపు తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడటంతో సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి చొచ్చుకొస్తోందని హెచ్చరించింది. ఈ ‘సీవాటర్ ఇంట్రూజన్’ సమస్యతో తాగునీటి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉంది. ముందుకెళ్తే నుయ్యి, వెనకెళ్తే గొయ్యి అన్నట్లు జిల్లా పరిస్థితి ఉంది.


