News December 29, 2025

చైనా మంజా విక్రయిస్తే కఠిన చర్యలు: భూపాలపల్లి ఎస్పీ

image

సంక్రాంతి పండగ వేళ నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా చైనా మంజాపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మంజా పక్షులకు, మనుషులకు ప్రాణాపాయం కలిగిస్తున్నందున ప్రభుత్వం దీనిపై నిషేధం విధించిందని, నిబంధనలు అతిక్రమించే దుకాణదారులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News January 8, 2026

మల్దకల్: మహిమాన్వితం ఆదిశిలా క్షేత్రం..!

image

మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం మహిమాన్వితంగా వెలుగొందుతోంది. క్షేత్ర దైవం తిమ్మప్ప స్వామి కొలిచిన భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజుల్లుతున్నాడు. ఇక్కడి ఆలయం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. స్వామిని నడిగడ్డ ప్రజలు కలియుగ దైవంగా భావిస్తారు. ఏటా డిసెంబర్‌లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఒక పెద్ద శిలకు మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామి, పశ్చిమ భాగాన ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశారు.

News January 8, 2026

టెండర్లు లేకుండా ‘లులూ’కు భూములా?: జగన్

image

AP: 2019-24 మధ్య పారిశ్రామిక వృద్ధిలో రాష్ట్రం నంబర్-1గా ఉండేదని మాజీ సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు బెదిరింపులు తాళలేక, కప్పం కట్టలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని విమర్శించారు. అదే సమయంలో తనకు ఇష్టమైన కంపెనీలకు పప్పుబెల్లాల్లా భూములు పంచిపెడుతున్నారని మండిపడ్డారు. ‘లులూ కంపెనీ అహ్మదాబాద్‌లో భూములు కొనుక్కుంది. ఏపీలో మాత్రం టెండర్లు లేకుండానే భూములు ఇచ్చేశారు’ అని ఆరోపించారు.

News January 8, 2026

నాన్న ఛాతీనే ❤️ పట్టుపాన్పు

image

భక్తుల శరణుఘోషలు, విపరీతమైన చలి.. ఇవేమీ లెక్కచేయకుండా నాన్న ఛాతీపై హాయిగా నిద్రపోతున్న కన్నెస్వామి ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసి ఆ మణికంఠుడిని దర్శించుకుని ఈ చిన్నారి అలసిపోయింది. నాన్న గుండెచప్పుడే గుడి గంటలుగా, ఆయన ఒడే పట్టుపాన్పుగా, ప్రపంచంలోనే సురక్షిత ప్రదేశంగా భావించి నిద్రపోయింది. ఆ తండ్రి కూడా బిడ్డ నిద్రకు భంగం కలిగించకుండా కదలకుండా ఉండిపోయాడు. ఎంతైనా అమ్మాయికి తండ్రే కదా సూపర్ హీరో.