News December 29, 2025

యూట్యూబర్ అన్వేష్‌ను అరెస్ట్ చేయండి: VHP

image

AP: యూట్యూబర్ అన్వేష్‌పై (నా అన్వేషణ) కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని VHP ప్రతినిధులు విశాఖ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడిన అతడిని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో అన్వేష్ ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్లను కోల్పోయారు.

Similar News

News January 11, 2026

చచ్చిపోవాలనే ఆలోచనల నుంచి అలా బయటపడ్డా: మలయాళ నటి

image

డిప్రెషన్‌లో ఉన్న సమయంలో మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరమని హీరోయిన్ పార్వతీ తిరువోతు అన్నారు. ఒకానొక సమయంలో తీవ్రమైన ఒంటరితనంతో బాధపడ్డానని, ఆ టైమ్‌లో చచ్చిపోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపారు. థెరపీ తీసుకోవడంతో దాని నుంచి బయటపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనను బాధపెట్టిన 2021లోని జనవరి, ఫిబ్రవరి నెలలను జీవితం నుంచి తీసేసినట్లు చెప్పారు. ఈ మలయాళ బ్యూటీ నాగచైతన్య ‘దూత’లో నటించారు.

News January 11, 2026

కాంగ్రెస్‌తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

image

ఈ సారి తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకోనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. హస్తం పార్టీ సీట్ల షేరింగ్ ప్రపోజల్‌ను స్టాలిన్ తిరస్కరించినట్లు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం ఉండబోదన్న DMK నేత, మంత్రి పెరియస్వామి మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు హీరో విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

News January 11, 2026

మైలురాళ్ల రంగుల గురించి తెలుసా?

image

*పసుపు: నేషనల్ హైవేలను సూచిస్తుంది. రాష్ట్రాలు, ప్రధాన నగరాలను కలిపే ఈ రోడ్లను NHAI మెయింటెన్ చేస్తుంది.
*గ్రీన్: ఇది స్టేట్ హైవేను సూచిస్తుంది. ఒక రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను కనెక్ట్ చేస్తుంది.
*బ్లాక్: సిటీ, జిల్లా రోడ్లను సూచిస్తుంది. అర్బన్ సెంటర్లు, మున్సిపాలిటీలను కలుపుతుంది.
*ఆరెంజ్: గ్రామాల రోడ్లను సూచిస్తుంది. PMGSY స్కీమ్ ద్వారా వీటిని అభివృద్ధి చేస్తారు.