News December 29, 2025
నిర్మల్ జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 8 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. సరఫరా తీరుపై అధికారులతో సమీక్షించిన ఆమె, అవసరానికి అనుగుణంగా నిల్వలు ఉన్నాయని, రైతులు ధీమాగా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
కర్కాటకము వర్షిస్తే కాడిమోకు తడవదు

సాధారణంగా కర్కాటక కార్తెలో వర్షాలు చాలా వేగంగా, కుండపోతగా కాకుండా కేవలం తుంపర్లుగా లేదా చాలా తక్కువ సమయంలోనే కురిసి ఆగిపోతుంటాయి. ‘కాడి’ అంటే ఎడ్ల మెడపై వేసే చెక్క, ‘మోకు’ అంటే దానికి కట్టే బలమైన తాడు. కర్కాటక కార్తెలో వర్షం ఎంత తక్కువగా కురుస్తుందంటే, కనీసం పొలంలో పని చేసే ఎడ్ల కాడికి ఉన్న ఆ తాడు కూడా పూర్తిగా తడవనంత తక్కువగా ఉంటుందని దీని అర్థం. ఈ వర్షం వల్ల ప్రయోజనం ఉండదని భావం.
News January 12, 2026
కర్నూలు: ‘పోలీసులనూ నడిరోడ్డుపై నడిపించండి’

చట్టం ముందు అందరూ సమానులే. ఇటీవల కొన్ని ఘటనల్లో నిందితులను పోలీసులు రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తప్పులు ఎవరూ చేయకూడదనే సంకేతాలు జనాల్లోకి తీసుకెళ్లేందుకే ఇలా చేశామంటూ వారు చెప్పుకొస్తున్నారు. పోలీసులు తప్పు చేస్తే రాజీ చేయడం, వీఆర్‌కు పంపడం లేదా సస్పెండ్ చేయడమేనా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో నలుగురు కర్నూలు పోలీసులు <<18825569>>వీఆర్<<>>కు వెళ్లిన విషయం తెలిసిందే.
News January 12, 2026
బాపట్ల: సంక్రాంతికి ఊర్లు వెళ్తున్నారా.. జాగ్రత్త

సంక్రాంతి పండగ వేళ ఇతర గ్రామాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని బాపట్ల జిల్లా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. సెలవులకు వెళ్లే వారు సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం వెల్లడించరాదన్నారు. దొంగలు ఇదే అదునుగా తీసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర వేళల్లో 100 కు డైల్ చేయాలని సూచించారు.


