News December 29, 2025

జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ పోలీసు బందోబస్తు

image

జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. DEC 31 సాయంత్రం 6 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ పోలీసు బందోబస్తు, నిరంతర పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అనుమతి లేకుండా వేడుకలు, డీజేలు పెట్టవద్దన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయన్నారు.

Similar News

News January 1, 2026

MBNR: ట్రాలీ బోల్తా.. 15 మేకలు మృతి

image

ఇల్లందు మండలం పోచారం తండా సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మేకలు మృతి చెందాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంచార జీవుల మేకల ట్రాలీ, గుండాల మండలం శెట్టిపల్లి నుండి మేత కోసం వెళ్తుండగా పోచారం గుట్ట వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, లోపల ఉన్న 15 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

News January 1, 2026

‘సిటీ ఆఫ్ హనీ’ అని దేనిని పిలుస్తారో తెలుసా?

image

సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో తేనె ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ను ‘సిటీ ఆఫ్ హనీ’ అని పిలుస్తారు. ఇండో-నేపాల్ బార్డర్‌ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం పండ్ల తోటలు, పూల వనాలతో తేనెటీగల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన తేనెను యూరప్, గల్ఫ్, సౌత్‌ ఈస్ట్ ఏషియాకు ఎగుమతి చేస్తారు. దేశంలోని చాలా రాష్ట్రాలకు కూడా మహారాజ్‌గంజ్‌ నుంచే సప్లై అవుతుంది.

News January 1, 2026

‘రాష్ట్రంలోనే జగిత్యాలను ప్రథమ స్థానంలో నిలుపుదాం’

image

విద్యా రంగంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదామని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ JGTL జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సం.డైరీ, క్యాలెండర్‌ను గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, DEO రాములు ఆవిష్కరించారు. ఇందులో TRS రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.