News December 29, 2025
మేడారంలో అధికారులకు ఎస్పీ సూచనలు

మేడారం మహా జాతర సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరించారు. ముందస్తు మొక్కులు చెల్లిస్తున్న భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు.
Similar News
News January 2, 2026
నేషనల్ హైవేలపై నేడు మచిలీపట్నంలో కీలక సమీక్ష

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిథిలో నేషనల్ హైవేల అభివృద్ధిపై మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. మచిలీపట్నంలోని ఎంపీ బాలశౌరి క్యాంప్ ఆఫీస్ నుంచి నేషనల్ హైవే ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
News January 2, 2026
పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది.
News January 2, 2026
పల్నాడు: కలెక్టర్ పిలుపునకు స్పందన.. 1,575 పుస్తకాల అందజేత

నరసరావుపేటలో కలెక్టర్ కృత్తికా శుక్లా వినూత్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో బొకేలు, శాలువాలకు బదులు పేద విద్యార్థుల కోసం పుస్తకాలు ఇవ్వాలని ఆమె కోరారు. దీనికి స్పందించిన అధికారులు, ప్రముఖులు మొత్తం 1,300 నోటు పుస్తకాలు, 275 పాఠ్యపుస్తకాలను కలెక్టరేట్‌లో అందజేశారు. ఈ పుస్తకాలను త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.


