News December 29, 2025

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి మండిపల్లి..!

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చడం దాదాపు ఖరారైంది. ఇదే అంశంపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈక్రమంలో మంత్రి మండిపల్లి కన్నీటి పర్యంతం కాగా.. ఆయనను సీఎం చంద్రబాబు ఓదార్చరని సమాచారం. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటితో అన్నమయ్య జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం మదనపల్లె అవుతుందని సమాచారం.

Similar News

News December 29, 2025

పుర పోరుకు సూర్యాపేట సిద్ధం.!

image

SRPT జిల్లాలోని 5 మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారిక జాబితా వెల్లడించింది. సూర్యాపేటలో 48 వార్డులు, జనాభా 1,33,399, ఎస్టీ 20393, ఎస్సీ 10471గా ఉంది. HNRలో 28 వార్డులు, జనాభా 35,850, ఎస్టీ 537 ఎస్సీ 4219 , కోదాడ లో 35 వార్డులు, జనాభా 75,093, ఎస్టీ 4185, ఎస్సీ 10,556, తిరుమలగిరి 15 వార్డులు, జనాభా 18,474 , ఎస్టీ 1607, ఎస్సీ 3671, నేరేడుచర్ల వార్డులు 15 జనాభా 14,853, ఎస్టీ 394, ఎస్సీ 3183గా ఉన్నారు.

News December 29, 2025

భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి

image

భువనగిరి జిల్లాలోని 6 పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక జాబితా వెల్లడించింది. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు, జనాభా ఓటర్లు 47913, మోత్కూరు 12 వార్డులు, ఓటర్లు 14423, ఆలేరు 12 వార్డులు, ఓటర్లు 13526, చౌటుప్పల్ 20 వార్డులు ఓటర్లు 27300, పోచంపల్లి 13 వార్డులు, ఓటర్లు 15665, యాదగిరిగుట్ట 12 వార్డులు, ఓటర్లు 13526గా నమోదయ్యాయి.

News December 29, 2025

సిరిసిల్ల: సీఎస్, ఉత్తమ్‌కు కేటీఆర్ ఫోన్

image

కాళేశ్వరం 11వ ప్యాకేజీ కాలువల నిర్మాణం కోసం భూమిని సేకరించి, దానికి సంబంధించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. తంగళ్లపల్లి మండల మాజీ సర్పంచులు ఆయనను కలిసి సమస్యను వివరించడంతో ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావులతో ఫోన్‌‌లో మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.3.19 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.