News April 24, 2024
విశాఖ: మాజీ మంత్రిపై నాలుగు కేసులు
మాడుగుల అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తన చేతిలో రూ.50 వేల నగదు, బ్యాంకు డిపాజిట్లు రూ.7.69 లక్షలు, భూముల విలువ రూ.21.17 కోట్లు, భార్య పేరున రూ.5.81 కోట్ల ఆస్తులు, కారు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023లో సీఎం జగన్‌ను దూషించినందుకు, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పినగాడిలో అధికారులను అడ్డుకున్నందుకు, 2009లో సబ్బవరం పీఎస్‌లో మరో కేసు ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
KGHలో రౌడీషీటర్ హల్చల్
విశాఖ కేజీహెచ్‌లో రౌడీషీటర్ బుధవారం హల్చల్ చేశాడు. ఆస్పత్రిలో పనిచేసే రౌడీషీటర్ రాజును విధుల నుంచి తప్పించారు. దీంతో రాజు పిల్లల వార్డుకు ఆక్సిజన్ వెళ్లే పైప్‌లైన్‌ను కట్ చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్‌ను కత్తితో బెదిరించాడు. మరో ఇద్దరు రాజుకు సహకరించగా ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.
News February 5, 2025
గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్
గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్‌కు తరలించామన్నారు.
News February 5, 2025
పీఏసీ సభ్యుడిగా విష్ణుకుమార్ రాజు
రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ సభ్యుడుగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివిధ కమిటీల సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ప్రజా పద్దుల కమిటీలో విష్ణుకుమార్ రాజుకు స్థానం లభించింది.