News December 29, 2025

2025లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. పెరిగిన విలువ!

image

2025లో ఇళ్ల అమ్మకాలు యూనిట్లపరంగా 14% తగ్గినా.. విలువ మాత్రం 6% పెరిగింది. సామాన్యులు కొనే బడ్జెట్ ఇళ్ల కంటే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడమే దీనికి కారణం. మధ్యతరగతి జనం ఇళ్లు కొనడానికి కాస్త వెనకడుగు వేశారు. మరోవైపు ఆఫీస్ స్పేస్, కమర్షియల్ బిల్డింగుల లీజింగ్ మాత్రం అదరగొట్టింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గి, బడ్జెట్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటే మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందని బిల్డర్లు ఆశిస్తున్నారు.

Similar News

News February 16, 2026

విశ్వక్‌కు వరుస షాక్‌లు.. రూటు మార్చాల్సిందేనా?

image

ENE, ఫలక్‌నుమాదాస్ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చాలా కాలంగా హిట్‌కు దూరమైన ఆయనకు తాజాగా రిలీజైన ‘ఫంకీ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు ‘లైలా’, ‘మెకానిక్ రాకీ’ కూడా ఫెయిలయ్యాయి. దీంతో విశ్వక్‌ సరైన కథలను ఎంపిక చేసుకోవట్లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ENE2’, ‘కల్ట్’ సినిమాలైనా ఆయనకు హిట్ ఇస్తాయేమో చూడాలి.

News February 16, 2026

ఆగ్నేయ మూలలో వాస్తు దోషం ఉంటే?

image

ఆగ్నేయం దోషపూరితంగా ఉంటే కుటుంబంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘కష్టపడి సంపాదించిన ధనం వృథా అయ్యే ఛాన్సుంది. రావలసిన డబ్బు సమయానికి అందదు. ఇంట్లో మహిళలు మానసిక వేదనకు, అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కుటుంబీకుల మధ్య ఐక్యత లోపించి, నిరంతరం చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థలాన్ని వినియోగించుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 16, 2026

మగాళ్లలో టెస్టోస్టిరాన్ తగ్గితే?

image

పురుషుల వృషణాలలో, మహిళల అండాశయాలలో ఉత్పత్తి అయ్యే సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్. కండరాల బలం, ఎముకల సాంద్రత, లైంగిక కోరిక, స్వరంలో మార్పు, సంతానోత్పత్తికి తోడ్పడుతుంది. అయితే జీవనశైలి మార్పులతో మగాళ్లలో టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గుతున్నాయి. అలసట, చికాకు, శృంగారంపై ఆసక్తి తగ్గడం, మజిల్ తగ్గి, కొవ్వు పెరగడం, మూడ్ స్వింగ్స్ దీని లక్షణాలు. బ్లడ్ టెస్టు ద్వారా టెస్టోస్టిరాన్ స్థాయులను తెలుసుకోవచ్చు.