News April 24, 2024

మోదీ మరో పుతిన్: పవార్

image

ప్రధాని మోదీ మరో పుతిన్‌లా అనిపిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. అందరిలో భయాన్ని పుట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘కొత్త భారతదేశాన్ని నిర్మించేందుకు నెహ్రూ తర్వాత ఇందిర, రాజీవ్, నరసింహారావు, మన్మోహన్ లాంటి ప్రధానులు చేసిన కృషిని చూశాం. ప్రస్తుత పీఎం మాత్రం కేవలం విమర్శలకు పరిమితం. పదేళ్లలో ఏం చేశారో చెప్పరు. ఇతరుల్ని మాత్రం కించపరుస్తారు’ అని విమర్శించారు.

Similar News

News November 6, 2025

స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TG: అన్ని స్కూళ్లలో రేపు ఉదయం 10 గంటలకు వందేమాతరం ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని అందులో పేర్కొంది. ఇక దేశ ప్రజలంతా ఇందులో పాల్గొనాలని కేంద్రం కోరింది.

News November 6, 2025

ట్రంప్ ఉక్కుపాదం.. 80వేల వీసాల రద్దు

image

అక్రమ వలసదారులతోపాటు వీసాలపై వచ్చి ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి 80వేల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. హింస, దాడులు, చోరీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసినా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను లెక్కచేయని 6వేలకు పైగా స్టూడెంట్ల వీసాలూ రద్దయినట్లు మీడియా తెలిపింది.

News November 6, 2025

వాణిజ్య కూడళ్ల సమీపంలో నివాసం ఉండొచ్చా?

image

బహుళ అంతస్తుల భవనాల సమీపంలో, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో నివాసం ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ ప్రాంతాలలో నిరంతర శబ్దం వల్ల అధిక ప్రతికూల శక్తి వస్తుందంటారు. ‘ఇది ఇంటికి శాంతిని, నివాసితులకు ప్రశాంతతను దూరం చేస్తుంది. వ్యాపార కూడళ్ల చంచలత్వం నివాస స్థలంలో స్థిరత్వాన్ని లోపింపజేస్తుంది. శుభకరమైన జీవనం కోసం ఈ స్థలాలకు దూరంగా ఉండాలి’ అని చెబుతారు. <<-se>>#Vasthu<<>>