News April 24, 2024
నంద్యాల: 596 మార్కులు సాధించిన విద్యార్థిని

నందికొట్కూరు ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ బాష కూతురు షేక్ రోషిని టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించింది. పరిక్షల ఫలితాల్లో 600కు గాను 596 మార్కులు సాధించి తన ప్రతిభ కనబరిచింది. తన కుతూరు ఈ మార్కులు సాధించడం గర్వకారణమని కుటుంబ సభ్యుడు రఫీ అహ్మద్ ప్రకటనలో తెలిపారు.
Similar News
News April 22, 2025
కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని వినతి

కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం కర్నూలు జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బృందం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసులు మాట్లాడారు. కర్నూలులో ప్రెస్ క్లబ్ లేకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. కలెక్టర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
News April 21, 2025
వాట్సప్ సేవలను ఉపయోగించుకోవాలి: కర్నూల్ కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాట్సాప్ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూల్ కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు” పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, డిఆర్ఓ వెంకట్ నారాయణమ్మతో కలిసి ఆవిష్కరించారు. ప్రభుత్వ సేవలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తుందన్నారు.
News April 21, 2025
ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజా గ్రీవెన్స్

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రీవెన్స్ వచ్చిన ప్రజా సమస్యలను తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డిఎల్పిఓ నూర్జహాన్, డిఎల్డిఓ రమణ రెడ్డి పాల్గొన్నారు.