News December 29, 2025

భారత ప్రభుత్వానికి లలిత్ మోదీ క్షమాపణ

image

పరారీలో ఉన్న IPL ఫౌండర్ లలిత్ మోదీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల విజయ్ మాల్యాతో కలిసి చేసిన <<18679569>>వీడియో<<>>పై తీవ్ర విమర్శలు రావటంతో స్పందించారు. ‘ఎవరి ఫీలింగ్స్‌నైనా గాయపర్చి ఉంటే క్షమించాలి. ముఖ్యంగా భారత ప్రభుత్వం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని Xలో పోస్ట్ చేశారు. వాళ్లను భారత్‌కు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

Similar News

News January 2, 2026

IIIT పుణేలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>IIIT <<>>పుణే 17 అడిషినల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్(CS&Engg.), PhD (ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్ Engg., అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiitp.ac.in

News January 2, 2026

ముస్తాఫిజుర్ IPLలో ఆడతారా? BCCI రిప్లై ఇదే?

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస <<18733577>>దాడుల<<>> నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే బంగ్లా ప్లేయర్లను బ్యాన్ చేయాలంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని BCCI ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని KKR, ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ‌ఖాన్‌‌ను పలువురు హిందూ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.

News January 2, 2026

అధిక వడ్డీ ఆశ చూపి మోసం.. ప్రభుత్వం చర్యలు

image

AP: కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ ఇస్తామంటూ స్కీమ్‌లతో మోసం చేసిన ‘శ్రేయ గ్రూప్’పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓనర్లు హేమంత్ కుమార్, సంగీతారాయ్ పేరిట ఉన్న ఆస్తులు సీజ్ చేసేందుకు CIDకి అనుమతి ఇచ్చింది. దీంతో జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో 51.55 ఎకరాల భూమిని CID సీజ్ చేయనుంది. భార్యాభర్తలైన హేమంత్, సంగీత 8,128 మంది డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారు.