News December 29, 2025
OFFICIAL: నెల్లూరులోకి గూడూరు.!

గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త మార్పులు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. మరోవైపు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను సైతం నెల్లూరు జిల్లాలోకి తీసుకురానున్నారు.
Similar News
News February 18, 2026
నెల్లూరు: ఆ 6 గ్రామాల్లో సోలార్ సిస్టం

‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద నెల్లూరు జిల్లాలో ఆరు పల్లెలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటించారు. తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి విడతగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివేలపాలెం, మనుబోలు, కాకుపల్లిలో సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్తు ఆదాతో పాటు ప్రజలకు ఆదాయం వస్తుందన్నారు.
News February 18, 2026
అలిపిరిలో పురాతన మండపం తొలగింపు

చాలామంది కాలినడకన తిరుమలకు వెళ్తారు. అలిపిరి వద్ద తొలి మెట్టు ఎక్కగానే కుడి వైపున పురాతన పాదాల మండపం ఉండేది. ఇకపై మీకు అది కనిపించదు. దీనిని పూర్తిగా తొలగించారు. పుణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్స్ ట్రస్ట్ నేతృత్వంలో ఆర్కియాలజీ అధికారులు పర్యవేక్షణలో మండలంలోని దూలాలు, స్తంభాలను జాగ్రత్తగా తొలగించి భద్రపరిచారు. తొలగించక ముందు, ఆ తర్వాత ఎలా ఉందో పై ఫొటోలో చూడవచ్చు.
News February 18, 2026
నెల్లూరు: రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన బాధ్యతలు తీసుకునే వరకు ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.


