News December 29, 2025

ESIC హాస్పిటల్ కలబురగిలో ఉద్యోగాలు

image

<>ESIC<<>> హాస్పిటల్, కలబురగి 6 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BDS, MBBS, MD, MSc(మెడికల్ ఫిజియాలజీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు జీతం ప్రొఫెసర్‌కు రూ.2,34,630, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,56,024, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,34,046 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

Similar News

News January 9, 2026

నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం: చంద్రబాబు

image

AP: ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. అప్పుడూ మమ్మల్ని ఇలాగే విమర్శించారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

News January 9, 2026

ట్రంప్ దెబ్బకు మార్కెట్ బేజారు.. భారీ నష్టాలు

image

భారత్‌పై 500% సుంకాలు విధించే ప్రపోజల్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 604 పాయింట్లు పతనమై 83,576 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.

News January 9, 2026

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

image

ఉదయ్‌పూర్‌(RJ)లోని లీలా ప్యాలెస్‌ హోటల్‌కు కన్జూమర్ కోర్టు ₹10 లక్షల జరిమానా విధించింది. చెన్నైకి చెందిన దంపతులు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది ‘మాస్టర్ కీ’తో గదిలోకి ప్రవేశించడమే దీనికి కారణం. వద్దని అరిచినా వినకుండా లోపలికి తొంగిచూసి ప్రైవసీకి భంగం కలిగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ‘Do Not Disturb’ బోర్డు లేనందునే లోపలికి వెళ్లామని యాజమాన్యం వాదించినా కోర్టు ఏకీభవించలేదు.