News December 29, 2025

కలెక్టరేట్‌లో వినతుల వెల్లువ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొనగా, మొత్తం 467 అర్జీలు నమోదయ్యాయి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Similar News

News January 1, 2026

ATP: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులు

image

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలోని కొందరు బేకరీ షాపుల యజమానులు చేతివాటం ప్రదర్శించారు. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేపట్టగా తూకాల్లో మోసం వెలుగు చూసింది. 1 కిలో కేక్‌కి 200 గ్రాములు తగ్గింది. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లులో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కణేకల్లులోని 2 షాపుల్లో రూ.20 వేలు, ఉరవకొండలో 4 షాపుల్లో రూ.41వేలు, విడపనకల్లులో 3 షాపుల్లో రూ. 27వేలు జరిమానా విధించారు.

News January 1, 2026

ATP: స్నేహానికి చిరునామా.. న్యూఇయర్ గ్రీటింగ్ కార్డ్స్

image

న్యూ ఇయర్ అంటేనే ఒకప్పుడు చిన్నారులు, యువత గ్రీటింగ్ కార్డ్స్‌తో సందడి చేసేవారు. దుకాణాల్లో ఛార్ట్స్ కొని ఫ్రెండ్స్‌కు అందించి విషెస్ చెప్పి ఆనందంగా గడిపేవారు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అన్నట్లు ఫీలైనవారు ఎంతోమంది. తమకు ఇష్టమైన నటీనటులు, ఫ్లవర్స్ వంటి కార్డులు కొనేవారు. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..!