News December 29, 2025

రంపచోడవరం: కొత్త జిల్లాకు పరిపాలనకు అవసరమైన భవనాలు కష్టమే.?

image

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా పేరిట నూతన జిల్లాకు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే రంపచోడవరం కేంద్రంలో పరిపాలన కోసం అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు కష్టతరంగా ఉండనుంది. ప్రస్తుతానికి వైటీసీ, పీఎంఆర్సీ భవనాలలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని శాఖల కార్యాలయాలకు భవనాలు ఏర్పాటు స్థానిక అధికారులకు తలనొప్పిగా మారనుంది.

Similar News

News January 2, 2026

ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: నల్గొండ కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని సూచించారు.

News January 2, 2026

సూర్యాపేట జిల్లాలో 17 మందికి కుష్టు వ్యాధి గుర్తింపు

image

సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 17 మందికి కుష్టు వ్యాధి సోకినట్లు గుర్తించామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ తెలిపారు. డిసెంబరు 18 నుంచి 31 వరకు ఆశా కార్యకర్తలు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి 1,042 మంది అనుమానితులను గుర్తించగా, పరీక్షల అనంతరం 17 మందికి నిర్ధారణ అయ్యిందన్నారు. బాధితులకు ఉచితంగా చికిత్స ప్రారంభించామని, లక్షణాలుంటే వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.

News January 2, 2026

జిల్లా కలెక్టర్‌ను కలిసిన నల్గొండ ఎస్పీ

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఎస్పీ మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు అంశాలపై వారు క్లుప్తంగా చర్చించుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొని కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.