News December 29, 2025

మరిన్ని మండలాలతో కొత్తగా తిరుపతి జిల్లా.!

image

కొత్త తిరుపతి జిల్లాలో ఇక నుంచి <<18703773>>36<<>> మండలాలు ఉండనున్నాయి. ఇది వరకు 34 ఉండగా కొత్తగా అన్నమయ్య నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని( 5 మండలాలు) తిరుపతి జిల్లాలో కలిపారు. మరోవైపు గూడూరు నుంచి మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపారు. దీంతో 36 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.

Similar News

News December 30, 2025

NTR: కృష్ణా నదిలో ఇక సందడే సందడి..!

image

పర్యాటకుల కోసం కృష్ణా నదిలో కేరళ తరహా హౌస్‌బోట్లు సిద్ధమయ్యాయి. వీటిని జనవరి 8న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రూ. 6-7 వేల ధరతో మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విహరించవచ్చు. ఇందులో బెడ్‌రూమ్, భవాని ఐలాండ్‌లో బస, సూర్యోదయ, సూర్యాస్తమయ వీక్షణలు ప్రత్యేక ఆకర్షణ. త్వరలో రాజమండ్రి, సూర్యలంక, గండికోటల్లోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని పర్యాటక శాఖ తెలిపింది.

News December 30, 2025

చిత్తూరు జిల్లాలో 31న రాత్రి తనిఖీలు

image

నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. తప్పతాగి రోడ్లపైకి రావడం, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ న్యూసెన్స్ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. 31వ తేదీ రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీ ఉంటుందన్నారు.

News December 30, 2025

2025: క్రీడల్లో మన సివంగులదే డామినేషన్

image

ఈ ఏడాది క్రీడల్లో భారత మహిళలు సత్తా చాటారు. వన్డే WC, తొలి అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ మన ఆడబిడ్డలే గెలుచుకున్నారు. కబడ్డీ WCను దక్కించుకున్నారు. ఇక ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2025 ఛాంపియన్‌గా వైశాలి నిలిచారు. హాకీ ఆసియా కప్‌, అథ్లెటిక్స్, వరల్డ్ బాక్సింగ్ కప్‌లోనూ భారత నారీమణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రెట్టించిన ఉత్సాహంతో వచ్చే ఏడాదికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించారు.