News December 29, 2025
స్టార్స్‌కి కాదు.. స్టోరీకే ప్రేక్షకుల జై!

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొన్ని చిన్న సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా ‘కోర్టు’ మూవీని రూ.5కోట్లతో తీస్తే రూ.55కోట్లు వచ్చాయి. 8 వసంతాలు, మ్యాడ్ స్క్వేర్, అరి మూవీస్ ఆకట్టుకున్నాయి. ఈవారం విడుదలైన శంబాల, దండోరా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. కంటెంట్‌కే ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి రుజువు చేశాయి. 2025లో రిలీజైన సినిమాల్లో మీకు నచ్చినదేంటో కామెంట్ చేయండి.
Similar News
News January 17, 2026
హైదరాబాద్‌కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News January 17, 2026
IAFకి మరింత బలం.. 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం

ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు మరో 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ₹3.25లక్షల కోట్ల విలువైన ఈ డీల్‌కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. FEBలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ IND పర్యటనలో డీల్ ఫైనలైజ్ అవ్వొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ సహకారంతో 60%+ స్వదేశీ కంటెంట్‌తో ఇవి తయారు కానున్నాయి. IND రాఫెల్స్ సంఖ్య 176కి పెరగనుంది.
News January 17, 2026
ALERT: ఈ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి

రెండ్రోజులుగా ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరిట రూ.5వేలు పొందొచ్చంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ తెగ వైరలైన విషయం తెలిసిందే. తాజాగా సైబర్ కేటుగాళ్లు SBI పేరిట ఇలాంటి లింక్స్, APK ఫైల్స్ పంపుతూ అకౌంట్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.9,980 రివార్డ్ పాయింట్స్ ఎక్స్‌పైరీ అని, రూ.5వేలు గిఫ్ట్ అంటూ లింక్స్ పంపి లూటీ చేస్తున్నారు. ఇలాంటి లింక్స్‌పై క్లిక్ చేయకండి. SHARE IT


