News December 29, 2025
గద్వాల: గ్రీవెన్స్ డేకు 20 ఫిర్యాదులు- ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కు 20 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భూ వివాదాలకు సంబంధించి 10, గొడవలకు సంబంధించి 2, భార్యాభర్తల తగాదా 1, ఇతర అంశాలకు సంబంధించి 7 మొత్తం 20 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.
Similar News
News January 12, 2026
MHBD జిల్లాలో యూరియా కొరత లేదు: ADA

జిల్లా వ్యాప్తంగా 571 యూరియా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సరిత తెలిపారు. PACS ఆధ్వర్యంలో 439, ప్రైవేట్ డీలర్స్, అదనపు సహకార శాఖ కేంద్రాలు 20, రైతు సేవ ఆగ్రోస్, ODCMC, మొదలగు కేంద్రాలు 112 ద్వారా యూరియా పంపిణీ పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 2లక్షల 89 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం కాగా, ఇప్పటికే 2లక్షల 25 వేల టన్నులు సేకరించామన్నారు.
News January 12, 2026
ప్రజావాణిలో 66 దరఖాస్తులు స్వీకరణ: అడిషనల్ కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల వద్ద నుంచి 66 ఫిర్యాదులు స్వీకరించామని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. డోర్నకల్, మహబూబాబాద్, గూడూరు, పెద్ద వంగర మండలాల నుంచి ప్రజలు పలు సమస్యలపై దరఖాస్తులు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ పురుషోత్తం, మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
News January 12, 2026
నల్గొండ: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. CSతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ముగిసిందని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.


