News December 29, 2025
MHBD: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న 86 దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాలకు పంపి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News January 25, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ భద్రాచలం: పాపికొండలకు లాంచీలు లేక పర్యాటకుల ఆందోళన
✓ బూర్గంపాడు: అదుపుతప్పిన కారు.. వ్యక్తికి గాయాలు
✓ కొత్తగూడెం: జాతీయ ఓటర్ల దినోత్సవం.. సైక్లింగ్ ర్యాలీ
✓ కొత్తగూడెం సింగరేణి ఏరియాలో కేంద్రమంత్రి పర్యటన
✓ కొత్తగూడెం, ఇల్లందు డీఎస్పీలుగా ఆదినారాయణ, సారంగపాణి
✓ దమ్మపేట: సర్పంచ్‌పై దాడి.. నిందితులపై అట్రాసిటీ కేసు
News January 25, 2026
వేదమంత్రోచ్ఛారణ నడుమ గోదావరి నది హారతి

భద్రాచలం గోదావరి మాత నదిహారతి అర్చక స్వాముల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమములో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు.
News January 25, 2026
అవార్డు అందుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2022 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాలో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిభ కనబర్చారు.


