News December 29, 2025
నటి మాధవీలతపై కేసు నమోదు

నటి మాధవీలతపై HYDలోని సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. SMలో సాయిబాబాపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపైనా కేసు పెట్టారు. వీరి పోస్టులు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించారు. అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News January 12, 2026
మకర జ్యోతి పర్వదినానికి భారీ ఏర్పాట్లు

కేరళలోని శబరిమలలో జనవరి 14న జరగనున్న మకరవిలక్కు (మకర జ్యోతి) దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏడీఎం అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత కోసం బారికేడ్లు, ఇతర సౌకర్యాలు సిద్ధం చేశామన్నారు. హైకోర్టు ఆదేశాలతో దర్శనానికి కఠిన పరిమితులు విధించారు. 14న వర్చువల్ క్యూ ద్వారా 30 వేల మందికే అనుమతి ఉంటుంది. తిరువాభరణ ఊరేగింపు నేపథ్యంలో పంబా-సన్నిధానం మార్గంలో తాత్కాలిక ఆంక్షలు అమలు చేయనున్నారు.
News January 12, 2026
నేడే PSLV-C62 ప్రయోగం

AP: ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి ISRO సిద్ధమైంది. తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C62 రాకెట్ ఈ రోజు ఉదయం 10.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1ను రోదసిలోకి పంపనున్నారు. దీనికి తోడుగా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.
News January 12, 2026
బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త CEOకి భారీ వేతనం

వారెన్ బఫెట్ <<18720997>>పదవీ విరమణ<<>> అనంతరం బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త CEOగా గ్రెగ్ అబెల్ బాధ్యతలు చేపట్టారు. 2026 సంవత్సరానికి ఆయన వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.208 కోట్లు)గా నిర్ణయించారు. ఇది గతంతో పోలిస్తే 19 శాతం ఎక్కువ కావడం విశేషం. బఫెట్ కంటే ఎక్కువ వేతనం పొందడం చర్చనీయాంశంగా మారింది. వైస్ ఛైర్మన్‌గా సేవలందించిన అబెల్, ఇప్పుడు బెర్క్‌షైర్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు.


