News December 29, 2025
పోలవరం జిల్లా జనాభా భౌగోళిక విస్తీర్ణం

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పడిన విషయం తెలిసిందే. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త జిల్లాలు అమలులోకి రానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పోలవరం జిల్లాలో జనాభా 3,49,000, 12 మండలాలు, 178 గ్రామ పంచాయతీలు, 140 గ్రామ సచివాలయాలు, 832 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. పోలవరం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 6431.63 sq కిలోమీటర్లగా ఉంది.
Similar News
News February 22, 2026
ధన్వంతరి మంత్రం ఎందుకు పఠించాలి?

ధన్వంతరిని ఆరోగ్య ప్రదాతగా కొలుస్తారు. ఆయుర్వేద అధిదేవత, దేవవైద్యుడు కూడా ఆయనే. అయితే ఆయన పేరుమీద ఉన్న ధన్వంతరీ మంత్రాన్ని పఠిస్తే అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారికి భవిష్యత్తులో రోగాలు వ్యాపించకుండా కాపాడుతుందని అంటున్నారు.
మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ! ధన్వంతరయే అమృత కలశ హస్తాయ| సర్వమయ వినాశాయ త్రైలోక్య నాథాయ| ధన్వంతరి మహావిష్ణవే నమః|
News February 22, 2026
933పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2026కు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఏడాది ఆలిండియా సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి(రిజర్వేషన్ గలవారికి సడలింపు). ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ మే 24న నిర్వహిస్తారు. సైట్: https://upsc.gov.in
News February 22, 2026
శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాటు

జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆర్. సురేష్ కుమార్ చెప్పారు. 71 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 39,838 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 71 మంది చీప్ సూపరింటెండెంట్లు, 831 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు.


