News December 29, 2025
అంతర్వేది వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి: కలెక్టర్

అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ ఏర్పాట్లపై సోమవారం అధికారులతో సమీక్షించారు. జనవరిలో జరిగే ఈ వేడుకలకు భక్తులు భారీగా వస్తారని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, క్యూలైన్ల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండకూడదని, భక్తులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News January 15, 2026
కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్‌లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.
News January 15, 2026
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ ఆంక్షలు

ఆర్టీసీ, పోలీస్ ఆదేశానుసారం రేపు నిర్మల్లో సీఎం సభ ఉన్నందున ఉదయం 11 నుంచి సభ అయిపోయే వరకు భైంసావైపు నుంచి వచ్చిపోయే బస్సులు ఈద్ ఘా చౌరస్తా వరకు, ఖానాపూర్, మంచిర్యాలవైపు నుంచి వచ్చిపోయే బస్సులు కొండాపూర్ బైపాస్ వరకు, నిజామాబాద్, హైదరాబాద్‌వైపు నుంచి వచ్చిపోయే బస్సులు సోఫీ నగర్ వరకు, ఆదిలాబాద్‌వైపు నుంచి వచ్చి వెళ్లే బస్సులు బైల్ బజార్ వరకు నడుపుతామని ఆర్టీసీ డీఎం పండరి తెలిపారు.
News January 15, 2026
దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో గుర్తుచేశారు.


