News December 29, 2025

తిరుమల: 365 రోజులు.. 450 ఉత్సవాలు

image

ఏడాదికి 365 రోజులే. కానీ కోరిన కోర్కెలు తీర్చే తిరుమల కోనేటి రాయుడికి ఏడాదిలో 450పైగా ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పద్మావతి పరిణయం తదితర ఉత్సవాలు చేస్తారు. ఇలా రోజూ ఒక పండగగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా తిరుమల విరాజిల్లుతోంది.

Similar News

News February 19, 2026

పలమనేరులో రూ.13.4 కోట్లకు ఐపీ

image

పలమనేరులో మరో ఐపీ బాంబు పేలింది. పలమనేరుకు చెందిన రియల్ ఎస్టేట్, సీజనల్ వ్యాపారి వెంకటరావు పలువురు దగ్గర అప్పులు తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో 71 మందికి రూ.13.4 కోట్లకు కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పట్టణంలో చీటీలు నిర్వహించడం, వ్యాపారాల కోసం అప్పులు తీసుకుని ఐపీ పెట్టడం రివాజుగా మారింది. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు.

News February 19, 2026

సోమల: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

image

సోమల మండలం కందూరు, చౌడేపల్లి వెళ్లే మార్గంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. గాయపడినవారిది చౌడేపల్లిగా స్థానికులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 19, 2026

చిత్తూరు: ఉపవాస దీక్షలు ప్రారంభం

image

జిల్లాలో ముస్లింలు గురువారం ఉదయం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మత పెద్దలు వెల్లడించారు. నెల రోజులపాటు కఠోర దీక్షలు చేపట్టనున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షలు నిర్వహించే వారి కోసం గంట ముందే వెళ్లేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.