News December 29, 2025

విజయ్ హజారేలో హైదరాబాద్ బే‘జారే’!

image

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మూడో సారి ఓటమి పాలైంది. సోమవారం జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో అస్సాం 4 వికెట్ల తేడాతో HYDను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అస్సాంలో శిబ్‌శంకర్ రాయ్ (112) మెరుపు సెంచరీ చేశాడు. సౌరవ్ (91) పరుగులతో రాణించాడు. దీంతో లక్ష్యాన్ని ASM 49.3 ఓవర్లలో సాధించి విజేతగా నిలిచింది.

Similar News

News January 15, 2026

బిక్కనూర్: ‘వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది జీవన విధానం’

image

వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది మన జీవన విధానం అని చాటిచెప్పింది కాచాపూర్ గ్రామానికి చెందిన చిన్నారి మహాన్వి. సంక్రాంతి పురస్కరించుకుని గురువారం ఆమె వేసిన ముగ్గు గ్రామస్తులను ఆలోచింపజేసింది. రైతు జీవన శైలిని ప్రతిబింబిస్తూ రంగురంగులతో తీర్చిదిద్దిన ఈ రంగవల్లిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే వ్యవసాయంపై మమకారాన్ని చాటిన మహాన్విని పలువురు అభినందించారు.

News January 15, 2026

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది. * వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది. * కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది. * అన్నం విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి. * చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.

News January 15, 2026

సంగారెడ్డి: 19 నుంచి సర్పంచులకు శిక్షణ తరగతులు

image

జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, వార్డ్ సభ్యులకు పాలనా విధానాలు, చట్టాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి విడతల వారీగా జిల్లా స్థాయిలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయని జిల్లా పంచాయతీ అధికారి జానకి రామ్ తెలిపారు.