News December 29, 2025

NRPT: జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

నారాయణపేట జిల్లాలో యూరియా కొరత లేదని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరఫరా కొనసాగుతోందని ఇంచార్జ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ప్రకటనలో చెప్పారు. జిల్లాలో రైతులకు ఇప్పటి వరకు 3000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, వివిధ పంపిణీ కేంద్రాల్లో 1009 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్‌లో 2885 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. యూరియా సరఫరా సజావుగా జరుగుతున్నదని చెప్పారు.

Similar News

News January 2, 2026

చైనాలో కండోమ్ ట్యాక్స్.. ‘ధరలు పెంచితే పిల్లలు పుట్టేస్తారా?’

image

కండోమ్‌లపై చైనా 13 శాతం పన్ను విధించింది. గర్భనిరోధక వస్తువులు, మందులపై ఈ ట్యాక్స్‌ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. గతంలో వన్ చైల్డ్ పాలసీ సమయంలో వీటికి మినహాయింపులు ఇచ్చింది. కానీ జననాల రేటు భారీగా పడిపోవడంతో గర్భనిరోధకాలను వాడకుండా పన్ను విధించింది. దీంతో ధరలు పెరిగితే పిల్లలు పుట్టేస్తారా అంటూ చైనా యువత SMలో సెటైర్లు వేస్తోంది. ‘ఏడాదికి సరిపడా ముందే కొనేశా’ అని ఓ యూజర్ పేర్కొన్నారు.

News January 2, 2026

ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో శ్రీహ సత్తా

image

మధురైలో ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ డిసెంబర్ 30న ఐదో సారి నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ బిలో 1800 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,245 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అనంతపురం జిల్లా క్రీడాకారిణి శ్రీహ 9కి 7 పాయింట్లతో ఓపెన్ విభాగంలో 21వ స్థానాన్ని సాధించింది. గురువారం కోచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీహ ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచిందన్నారు.

News January 2, 2026

ఎలాన్ మస్క్.. విరాళాల్లోనూ శ్రీమంతుడే!

image

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాను విరాళాల్లోనూ శ్రీమంతుడేనని నిరూపించారు. ఏకంగా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) విలువైన 2.10 లక్షల టెస్లా షేర్లను తన ఫౌండేషన్‌కు డొనేట్ చేశారు. 2024లో 112 మిలియన్ డాలర్లు, 2022లో 1.95 బిలియన్ డాలర్లు, 2021లో 5.74 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఛారిటీకి ఇచ్చారు. తాజా డొనేషన్ తర్వాత కూడా 619 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఆయన కొనసాగుతున్నారు.