News December 29, 2025

ADB: యూరియా పంపిణీ ప్రశాంతంగా చేయాలి

image

రబీ సీజన్‌లో యూరియా పంపిణీ ప్రశాంతంగా చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ASF జిల్లా అదనపు కలెక్టర్ వీసీ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరియా పంపిణీ, నిల్వలు, కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సమీక్షించారు.

Similar News

News January 1, 2026

ధనుర్మాసం: పదిహేడో రోజు కీర్తన

image

ద్వారపాలకుల అనుమతితో లోపలికి వెళ్లిన గోపికలు మొదట నందగోపుడిని, ఆపై యశోదమ్మను ‘మేలుకో’ అని వేడుకున్నారు. లోకాలను కొలిచిన త్రివిక్రమ స్వరూపుడైన కృష్ణుడిని నిద్రలేవమని ప్రార్థించారు. ఆపై బలరాముడిని నిద్రలేపడం మరచినందుకు చింతిస్తూ ‘బంగారు కడియాలు ధరించిన బలరామా! నీవు, నీ తమ్ముడు కృష్ణుడు వెంటనే మేల్కొనండి’ అని వేడుకున్నారు. ఇలా వరుసగా అందరినీ ప్రార్థిస్తూ, వారి కృప కోసం వేచి చూస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 1, 2026

యుద్ధంలో గెలిచేది మేమే: పుతిన్

image

ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో గెలిచేది తామేనని దేశం భావిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో పోరాడుతున్న హీరోలను(సైనికులు) సపోర్ట్ ప్రజలను చేయాలని కోరారు. ‘మేం మీపై, మన విజయంపై నమ్మకం ఉంచుతున్నాం’ అని సోల్జర్లను ఉద్దేశించి న్యూఇయర్ ప్రసంగంలో అన్నారు. తన నివాసంపై ఉక్రెయిన్ <<18728652>>డ్రోన్ దాడి<<>> గురించి ఆయన ప్రస్తావించలేదు. పుతిన్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 31తో 26 ఏళ్లు పూర్తయ్యాయి.

News January 1, 2026

సంగారెడ్డి: దరఖాస్తు గడుపు పెంపు

image

ఇంటర్ ఆపైన చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువు మార్చి 31వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి బుధవారం తెలిపారు. విద్యార్థులు ఉపకార వేతనాల కోసం http://telanganaepass.cgg.gov వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.