News December 29, 2025

NGKL: యాసంగి పంటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి: మంత్రి

image

జిల్లాలో యాసంగి పంటకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్‌తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో యాసింగి పంట ఏర్పాట్లపై జిల్లా అధికారులు మంత్రికి వివరించారు.

Similar News

News January 1, 2026

పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40% GST.. FEB 1 నుంచి..

image

ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, పొగాకు <<18695704>>ఉత్పత్తులపై<<>> నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలాపై 40% జీఎస్టీతో పాటు సెస్ విధించనుంది. అటు పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్సైజ్ డ్యూటీ అమలు కానుంది. అయితే బీడీలపై మాత్రం 18శాతం జీఎస్టీ ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

News January 1, 2026

భారీ జీతంతో ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌(EIL)లో 22 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 2 ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే నెలకు AGMకు రూ.1లక్ష-రూ.2,60,000, Sr.మేనేజర్‌కు రూ.90,000-రూ.2,40,000, మేనేజర్‌కు రూ.80,000-రూ.2,20,000, dy.మేనేజర్‌కు రూ.70,000-రూ.2,000000 చెల్లిస్తారు.

News January 1, 2026

మారింది డేటే.. ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే

image

క్యాలెండర్‌లో మారింది డేట్ మాత్రమే. మీ జీవితం కూడా మారాలని కోరుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. బలమైన ఆశయం, సంకల్పం, శ్రద్ధతో పని చేస్తే ఆలస్యమైనా విజయం మిమ్మల్ని చేరక తప్పదు. ఇయర్ మారింది.. మన టైమ్ కూడా మారుతుందని ఊరికే ఉంటే ఇంకో ఇయర్ వచ్చినా డేట్‌లో మార్పు తప్ప జీవితంలో కూర్పు ఉండదు. సో.. నేర్పుగా వ్యవహరిస్తే ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే..
ALL THE BEST