News December 29, 2025
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: ఎస్పీ

ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన 22 మంది బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 30, 2025
2025: సెలబ్రిటీల కొత్త ఛాప్టర్

టాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. జూన్ 6న హీరో అఖిల్-జైనబ్, DEC 1న హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఒక్కటయ్యారు. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ తన ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకున్నారు. హీరో నారా రోహిత్ నటి శిరీషను వివాహం చేసుకోగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్యను, విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు హర్షితను వివాహమాడారు.
News December 30, 2025
కొబ్బరి చెట్టుకు ఎరువులను ఎలా వేస్తే మంచిది?

కొబ్బరి చెట్టుకు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ తవ్విన పళ్లెములో వేసినప్పుడే, అవి నేలలో ఇంకి, వేర్లు, గ్రహించడానికి వీలు పడుతుంది. చెట్టు కాండమునకు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల దూరంలో 15 సెంటీమీటర్ల లోతున చుట్టూ గాడిచేసి, ఎరువులను చల్లి, మట్టితో కప్పి వెంటనే నీరు కట్టాలి. చెట్లకు ఉప్పువేయటం, వేర్లను నరికివేయడం వంటి అశాస్త్రీయమైన పద్ధతులను పాటించవద్దు. దీని వల్ల చెట్లకు హాని కలుగుతుంది.
News December 30, 2025
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,800 పతనమై రూ.1,24,850 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.23వేలు తగ్గి కిలో రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


