News December 29, 2025

ట్రాఫిక్ వాయిలేషన్‌లో రూ.16,73,29,000 పెనాల్టీ: సిద్దిపేట సీపీ

image

సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ 2025వ సంవత్సర వార్షిక నివేదిక సోమవారం రిలీజ్ చేశారు. గత సంవత్సరం ట్రాఫిక్‌కి సంబంధించి అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. ట్రాఫిక్ వాయిలేషన్‌కి పాల్పడిన వారి నుంచి రూ.16,73,29,000 పెనాల్టీ రూపంలో వసూలు చేసినట్టు వార్షిక నివేదికలో తెలిపారు. రోడ్డు భద్రత లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీపీ విజయ్ కుమార్ తెలిపారు.

Similar News

News January 13, 2026

విశాఖలో వాహనదారులకు అలర్ట్

image

విశాఖలో వాయు కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ‘నో పొల్యూషన్ సర్టిఫికేట్ – నో ఫ్యూయల్‌’పై టైకూన్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు వాహనదారులకు దీనిపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత పెట్రోల్ బంకుల్లో ఇబ్బందులు రాకుండా.. జరిమానాలు పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని త్రీ టౌన్ సీఐ అమ్మి నాయుడు తెలిపారు.

News January 13, 2026

తమిళ సంస్కృతిపై దాడి.. ‘జన నాయగన్’ జాప్యంపై రాహుల్

image

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలలో జాప్యంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చిత్రానికి అడ్డంకులు సృష్టించడం ‘తమిళ సంస్కృతిపై దాడి’ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ తమిళ ప్రజల గొంతును ఎప్పటికీ నొక్కలేరని Xలో పోస్ట్ చేశారు. దీనిపై BJP స్పందిస్తూ రాహుల్ అబద్ధాల కోరు అని.. గతంలో జల్లికట్టును ‘అనాగరికమైనది’గా పేర్కొన్న కాంగ్రెస్సే తమిళుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించింది.

News January 13, 2026

తిరుపతి: ఈ నంబర్ సేవ్ చేసుకోండి

image

తిరుపతి జిల్లాలో జల్లికట్టు, కోడిపందేలు, పేకాట పూర్తిగా నిషేధమని.. ఎక్కడా నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. ఎక్కడైనా వీటిని నిర్వహిస్తే ప్రజలు వెంటనే 112, వాట్సాప్ నంబర్ 8099999977కు మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.