News December 29, 2025
వనపర్తి మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

వనపర్తి మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 70,416 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 3,729, ఎస్సీ జనాభా 6,836గా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఈరోజు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం వీడింది.
Similar News
News January 11, 2026
JGTL: ఆఖరి మజిలీకి ముందే సమాధి నిర్మాణం.. అందులోనే అంత్యక్రియలు

మరణం అనివార్యం.. చివరి ప్రయాణమే గౌరవంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్(M) లక్ష్మీపూర్‌కు చెందిన నక్క ఇంద్రయ్య తన చివరి మజిలీకి ముందే తన తోటలోనే రూ.12 లక్షలు పెట్టి గ్రానైట్‌తో సమాధిని నిర్మించుకున్నారు. అప్పట్లో అది చాలా వైరల్‌గా మారింది. అయితే, ఇంద్రయ్య శనివారం మృతి చెందడంతో తన కోరిక ప్రకారం ముందే నిర్మించిన సమాధిలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేయడం విశేషం.
News January 11, 2026
నిజామాబాద్ జిల్లా పద్మశాలి కాలమానిని ఆవిష్కరణ

పద్మశాలి భవనంలో పద్మశాలి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాలమానిని – 2026ను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చౌకే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఐక్యతకు, సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆసమ్ నవీన్, కోశాధికారి బాస దేవిదాస్, భూమేశ్వర్, రుద్ర గణపతి, భోజదాస్ పాల్గొన్నారు.
News January 11, 2026
ఇంటికి చేరుకోవడమే పెద్ద ‘పండుగ’

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ట్రాఫిక్, మరోవైపు సమయానికి బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకోవడమే పెద్ద పండుగగా భావిస్తున్నారు. VJA-HYD హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అటు HYDలోని బస్టాండ్లలో వచ్చిన వెంటనే బస్సులు కిక్కిరిసిపోతుండటంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.


