News December 29, 2025

MBNR:T-20 టోర్నీ.. మన టీం షెడ్డుల్ ఇదే!

image

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన జి.వెంకటస్వామి మెమోరియల్ “టీ-20 క్రికెట్ లీగ్” లో ఉమ్మడి మహబూబ్ నగర్ క్రికెట్ జట్టు పాల్గొంటుందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు.
✒ఈనెల 29న MBNR- కరీంనగర్
✒ఈ నెల 31న MBNR-HYD
✒Jan 3న MBNR- ఖమ్మం
✒Jan 5న MBNR-RR
✒Jan 6న MBNR- వరంగల్
✒Jan 8న MBNR- అదిలాబాద్
✒Jan 9న MBNR- నల్గొండ
✒Jan 13న MBNR- నిజామాబాద్
✒Jan 15న MBNR- మెదక్

Similar News

News January 5, 2026

మహబూబ్‌నగర్: పేదలకు వరం ‘గృహజ్యోతి’

image

నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వారికి ఒక వరమని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.3,593 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించిందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News January 5, 2026

MBNR: 87126 59360.. SAVE చేసుకోండి

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తుతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 100/112’ లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబరు 87126 59360కు సమాచారం అందించాలని ఆమె కోరారు.

News January 5, 2026

మహబూబ్‌నగర్‌లో భూ ప్రకంపనల కలకలం..?

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సమీప కాలనీల్లో సోమవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా కిటికీలు, సామాన్లు కదలడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది భూకంపమా లేక బ్లాస్టింగ్ వల్ల జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.